జబర్దస్త్ రాంప్రసాద్ కి ఆక్సిడెంట్
- టాలీవుడ్ చిత్రపరిశ్రమకి చెందిన ప్రముఖ హాస్యనటుడు ఆక్సిడెంట్కి గురయ్యారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..
హైదరాబాద్, డిసెంబర్ 5 (విశ్వం న్యూస్) : జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ఇళ్లలో మంచి పేరు సంపాదించుకున్న హాస్యనటుడు రాంప్రసాద్. ఆయన గురువారం షూటింగ్ నిమిత్తం తుక్కుగూడ ORR గుండా తన కారులో ప్రయాణిస్తుండంగా ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేసింది. దీంతో రాంప్రసాద్ కారు..
ఆ కారుని ఢీ కొట్టింది. వెనుక నుండి వస్తున్న మరో ఆటో కూడా కారుని ఢీ కొట్టడంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు.