మంత్రి సీతక్కపై
మంత్రి శ్రీదేవి ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 9 (విశ్వం న్యూస్) : తెలివి లేనోళ్ళు మాత్రమే నిన్ను నక్సలైట్ అంటారు.
పాతఫోటో ఒకటి దాచుకున్నావు,నీ ఉనికి బలహీనపడ్డప్పుడల్లా ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటావు. నక్సలైట్లపట్ల ప్రజలకుండే ప్రేమానురాగాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటావు.
నిజమైన నిఖార్సయిన నక్సలైట్లు నీలా అలివ్ గ్రీన్ డ్రస్ తో కూడిన సాయుధఫోటోలను పబ్లిసిటీ కోసం వాడుకోరమ్మా!!!!
నీలా పారిపోయి వచ్చినవాళ్ళు దగ్గర అసలు ఫోటోనే ఉండదు.
అసలు మావోయిస్టు అనేపేరు ఎత్తే అర్హత నీకు లేనేలేదు.
మావోయిస్టుల జీవితం కఠినతరంగా ఉంటుంది.
పర్వతాలను గులకరాళ్ళుగా,కారడవులను కాలిబాటగా భావించి ప్రజలకోసం కష్టాలను సంతోషంగా స్వీకరిస్తారు……
వాళ్ళు నమ్మిన ఆశయంకోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తారు.
నీలా డ్రామా నక్సలైట్లు కాదమ్మావాళ్ళు.
వాళ్ళు నిజమైన నక్సలైట్లు.
ఆదివాసి బిడ్డను అవమానిస్తున్నారని మొసలికన్నీరు కారుస్తున్నావు.
మొన్న నీ నియోజకవర్గంలో మీ ప్రభుత్వం ఆదివాసి పిల్లలను పొట్టనపెట్టుకుంది.
అప్పుడు నీవు ఆదివాసి బిడ్డనని మరచిపోయావా?????
కనీసం చిన్ని సానుభూతి అయినా ప్రకటించావా?
నీవు పనిచేసింది మావోయిస్టు పార్టీలో కాదని మాకు తెలుసు.
మావోయిస్టుల ఆచూకికోసం పోలీసుల అనుమతితో తిరిగే ఒక నకిలీ నక్సలైట్ గ్రూపులో పనిచేశావని కూడా మాకు తెలుసు…..
మావోయిస్టులు తమ ఆశయసాధనకోసం ఎంచుకున్న మార్గంతో నాకు ఏకీభావం లేకపోయినా వాళ్ళు వ్యక్తిగతంగా మంచివాళ్ళు. నీలా పదవులకోసం వాళ్ళు దిగజారరు.