అల్లు అర్జున్ అరెస్ట్
- సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (విశ్వం న్యూస్) : సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటీషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీవర్గాలతోపాటు అభిమానులు షాకయ్యారు.