మాదాపూర్: IT కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

మాదాపూర్: IT కంపెనీలో
భారీ అగ్ని ప్రమాదం

  • భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు
  • హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన

హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఉన్నట్లుంటి సాఫ్ట్‌వేర్ సంస్థలో మంటలు చెలరేగాయి. ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షణాల వ్యవధిలోనే మంటలు బిల్డింగ్‌లోని ఐదు అంతస్తులకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు.

ఫైర్ యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా, ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్నపేటనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం (డిసెంబర్ 19) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్ర్కాప్ గోదాంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టారు. మంటలకు తోడు దట్టమైన నల్లటి పొగ వ్యాపించటంతో సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఆరు ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *