రమేష్ కి లైబ్రరీ సైన్స్‌లో డాక్టరేట్
హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్) : ఈ. రమేష్ లైబ్రరీ సైన్స్‌లో డాక్టరేట్ పొందారు. కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ ఆయనకు ఈ డిగ్రీను ప్రదానం చేసింది. “క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఇన్ సెలెక్టెడ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైబ్రరీస్ ఇన్ హైదరాబాద్ రీజియన్” అనే అంశంపై డాక్టర్ ఎం. అంజయ్య గారి పర్యవేక్షణలో ఆయన ఈ పరిశోధన పూర్తి చేశారు.
రమేష్ గారు గ్రంథపాలకునిగా 25 సంవత్సరాల అనుభవం కలిగి, ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో సేవలందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సెమినార్లలో పాల్గొని పలు ప్రశంసల పత్రాలను అందుకున్నారు.
అంతేకాకుండా, మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ద్వారా ఉత్తమ గ్రంథపాలకుని అవార్డు పొందడం విశేషం. ఈ ఘనతకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. అరవింద్ కుమార్, ఇతర విభాగాధిపతులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
రమేష్ గారి విజయం లైబ్రరీ శాస్త్రానికి మించిన గౌరవాన్ని తీసుకువచ్చిందని అభినందనలు!