అల్లు అర్జున్ అసలు మనిషేనా..!!

  • అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి
  • డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు థియేటర్‌లోనే కూర్చున్నాడు
  • అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాడు
  • అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా
  • అల్లు అర్జున్ విషయంలో ఇంత జరిగితే హై కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది
  • రాత్రి 12 లోపు జైలు నుండి వదిలి పెట్టాలని చెప్పింది.. రాత్రికి రాత్రే నేనెందుకు వదిలిపెట్టాలి
  • -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్) : సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పారు. తాము అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వనని వార్నింగ్ ఇచ్చారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండన్న సీఎం.. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.

హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ప్రవర్తించాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. పలువురు నాయకులు చేసిన కామెంట్స్‌ను ఆయన అసెంబ్లీలో ఉటంకించారు. తనను నీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టారన్నారు. మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి అడ్డగోలుగా పోస్టులు పెట్టారన్నారు. సదరు హీరో భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిని తిట్టడానికి నీచమైన భాషను వాడారన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్లను ఏం చేయొద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. స్టార్, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్,పొలిటికల్ స్టార్స్‌కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? అని సీఎం ప్రశ్నించారు. సినిమా వాళ్లు హత్యలు చేసినా విచారణ చేయొద్దంటూ చట్టం చేద్దామా? అని అసెంబ్లీలో ప్రశ్నించారు సీఎం రేవంత్.

ఒక్క రోజు పోలీసు స్టేషన్‌లో ఉన్న అల్లుఅర్జున్ ఇంటికి సినిమాఇండస్ట్రీ క్యూ..కట్టి ప్రభుత్వాన్ని, తనను తిడుతున్నారని అన్నారు. అల్లు అర్జున్‌కు ఏమైంది?, ఆయన కాలుపోయిందా?, కన్ను పోయిందా?, చేయి పోయిందా?, కిడ్నీలు దెబ్బతిన్నాయా?.. ఎందుకు ఆయనను సినీ ప్రముఖులు పరామర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక నిండు ప్రాణం పోతే సినీ ప్రముఖులు అసలు వారి కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఏం ఆలోచన చేస్తున్నారు?, ఏం కోరుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *