బిగ్ బ్రేకింగ్ : రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల

హైదరాబాద్, జనవరి 21 (విశ్వం న్యూస్) : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కసారిగా తనలోని ఉగ్రరూపాన్ని బయటపెట్టారు. ఎప్పుడూ శాంతంగా ఉండే ఆయన తనలోని సీరియస్ యాంగిల్‌ను బయటకు తీయడంతో తోటి ఫాలోవర్స్ , అనుచరులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏమైందంటే.. మంగళవారం ఉదయం ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా పోచారంలో పర్యటించారు.
పేదల భూములను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆక్రమించాడని ఆయనకు ఫిర్యాదులు అందాయి. తమకు న్యాయం చేయాలని బాధిత పేద ప్రజలు ఈటలను వేడుకున్నట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలికి వెళ్లిన ఆయన బ్రోకర్‌తో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. రియల్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో ఎంపీ అనుచరులు, బీజేపీనేతలు సైతం ఆ బ్రోకర్ మీద దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈటల సాధారణంగా సాత్వికంగా కనిపించినప్పటికీ, కోపం వస్తే ఊగిపోతారా? అనే ప్రశ్నలు నెటిజన్లలో వినిపిస్తున్నాయి., పేదల హక్కులను కాపాడటమే తన లక్ష్యమని ఈటల మద్దతుదారులు అంటున్నారు.