రేషన్ కార్డు లబ్ధిదారులకు
సన్నబియ్యం:మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జనవరి 26 (విశ్వం న్యూస్) : రిపబ్లిక్ డే వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. అన్ని పేద కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఆరు కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. గత సీజన్‌లో పండిన ధన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రజలకు అందినున్నట్లు చెప్పారు.
ప్రజాపాలన, ప్రజావాణి లేదా మీసేవా కేంద్రాలు, సామాజిక ఆర్థిక సర్వేల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ కొత్త రేషన్ కార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఇటీవల గ్రామసభల్లో చదివి వినిపించిన లిస్టులో పేర్లు లేనివారు మళ్లీ అఫ్లయ్ చేసుకోవచ్చునని చెప్పారు. వారి దరఖాస్తులు పరిశీలించి అర్హులు అని తెలితే.. వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు.
కార్డుల జారీ ప్రక్రియ ముగిశాక.. ఆయా లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఫ్రీగా అందిస్తామని అన్నారు. కాగా, ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. దేశచరిత్రలో ఇదో ప్రత్యేక సందర్భమని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.