ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం. (వీడియో)

ఆటోలపైకి దూసుకువెళ్లిన లారీ..
నలుగురు మహిళలు,
ఒక బాలుడు మృతి

  • మామూనూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం.

వరంగల్, జనవరి 26 (విశ్వం న్యూస్) : మామూనూరు ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం మరింత దురదృష్టకరం. ఇనుప స్తంభాలను తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలపైకి దూసుకువెళ్లిన లారీ.. నలుగురు మహిళలు, ఒక బాలుడు మృతి.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ.. మామునూరు బెటాలియన్ సమీపంలో రాంగ్ రూట్ తీసుకుంది. అనంతరం ముందుకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తూ ఇనుప రాడ్లు కట్టి ఉంచిన తాడు తెగిపోయింది.

ఈ ప్రమాదంలో లారీ పక్క నుంచి వెళ్తున్న రెండు ఆటోలపై ఐరన్ రాడ్లు పడ్డాయి. దీంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఓ ఆటో డ్రైవర్‌ కాలు విరిగి విలవిలలాడిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇనుప రాడ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *