ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే “కెసిఆర్.”

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : ఈరోజు సర్దార్ రామన్న చెప్పిన మాట వందశాతం నిజం.
బాపు కెసిఆర్ తను నిలబడడమేకాదు, తెలంగాణను నిలబెట్టాడు, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. ప్రపంచంముందు తెలంగాణను సమున్నతంగా తల ఎత్తుకునేటట్టు చేశాడు.
ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు, సింహానికైనా ఈగల బెడద తప్పదు.

మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం కష్టం, మనలో కూడా కొద్దోగొప్పో ఆ ఛాయలు ఉండాలి.
పరాయివాడి పాదాల దగ్గర ఊడిగం చేసినవాళ్ళకు బాపు కేసిఆర్ గొప్పదనం అర్థంకాదు.
నోటికొచ్చినట్టు బాపును తిడుతున్నాడు. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రానా నిజం అబద్దమైపోదన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది.

నిన్ను నీవు పొగుడుకుంటూ మా బాపు కేసిఆర్ ని తూలనాడితే నీవు గొప్పవాడివైపోవు.
నీతిని బోదించడానికి అర్హతలేనివాళ్ళు నీతిని బోదిస్తే ప్రజలకు నీతి మీదనే నమ్మకంపోతుంది.
నీ జబ్బలు నీవు చరుచుకున్నంతమాత్రానా నీవు బలవంతుడవుకావు,నీ బలమేమిటో ప్రజలే తేల్చుతారు.
తన బండారం బయటపడుతుందనే భయంతోనే లోకల్ బాడి ఎలక్షన్లు నిర్వహించడానికి వెనుకంజ వెస్తున్నాడు. తనలాంటి బానిస ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు ఎన్ని అబద్దాలు,అర్దసత్యాలు చెప్పిన నమ్ముతారని అనుకుంటున్నాడు.

అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన అబద్దాలు చెప్పాడు. అలవికాని హామీలిచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేక అవే వెకిలి మాటలను, చిల్లర భాషను వాడుతున్నాడు. ఈరోజు గ్రామీణ తెలంగాణకు కనువిప్పు కలుగుతుంది. తను చేజార్చుకున్నదేంటో గ్రహిస్తుంది. తను ఎవరిని కోల్పోయిందో, ఎంత నష్టపోయిందో తెలుసుకుంటుంది. తనకు గోరుముద్దులు తినిపించిన అపన్నహస్తాన్ని కాదని భస్మాసుర హస్తాన్ని నమ్ముకున్నందుకు తల బాదుకుంటుంది.

తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటుంది. తప్పును సరిదిద్దుకోవడానికి అదనుకోసం వేచి చూస్తుంది. గద్దెమీద ఉన్నోడు ఎవరి ప్రయోజనాలకోసం పని చేస్తున్నాడో అర్థమైంది. హైదరాబాద్ తెలుగువారిదని దావోస్ వేదికగా చెప్పిన మాటల్లో ఉన్న దగాను కనిపెట్టింది. బాపు హయాంలో కళకళలాడిన నదులు,చెరువులు కుంటలు ఎందుకు వట్టిపోయాయో, పంటలు ఎందుకెండిన్నాయో సోయికొచ్చింది.
రైతన్నల ఆత్మహత్యలకు కారణమేమిటో అవగతమైంది. తెలంగాణ బతుకమ్మకు,కాకతీయ వైభవానికి,మన సంస్కృతికి జరుగుతున్న అవమానం వెనుక ఉన్న కుట్ర తెలిసిపోయింది.

మన తెలంగాణ అస్థిత్వం కోల్పోకూడదంటే, మన తెలంగాణ తిరిగి పరాయికరణకు గురి కాకూడదంటే ఇప్పుడున్న ప్రభుత్వం గద్దె దిగవలసిందనే తెలివి తెలంగాణ పల్లెకు వచ్చేసింది. తనకు న్యాయంచెసే నాయకుడు కేసిఆర్ కి తిరిగి పట్టం కట్టాలనుకుంటుంది. ఇది ముమ్మాటికి నిజం,రాసిపెట్టుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *