
హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్) : దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఎన్నికల అనంతరం తన విజయం కోసం సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి ఒకరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.