రేపే ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు
శ్రవణ్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బీసీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న డా. దాసోజు శ్రవణ్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, నాకు పితృసమానులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆశీర్వాదంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను,” అని తెలిపారు.

ప్రమాణ స్వీకారం ముందు ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ కె.టి.ఆర్ గారు, శ్రీ హరీశ్ రావు గారు, శ్రీ మధుసూదనాచారి గారు, తదితర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉద్యమకారులు మరియు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

“ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు హాజరై నన్ను ఆశీర్వదించగలరని సవినయంగా ఆహ్వానిస్తున్నాను” అంటూ శ్రవణ్ గారు ఆకాంక్షించారు.