ఐనవోలు: విద్యా, ఉద్యోగాల్లో
క్రీడాకారులకు ప్రాధాన్యత

- క్రీడా నైపుణ్యాలను పెంచుకొని జాతీయస్థాయిలో రాణించాలి
- సాఫ్ట్బాల్ క్రీడాకారులకు అండగా నిలుస్తాం
- తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు
ఐనవోలు, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా మరియు ఉద్యోగాల్లో క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మంగళవారం ప్రారంభమైన సాఫ్ట్బాల్ సమ్మర్ క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేందుకు శిక్షణ తీసుకోవాలని ఆయన సూచించారు. సాఫ్ట్బాల్ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తో పాటు అసోసియేషన్ పలు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆశ्वాసనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, క్రీడా ప్రోత్సాహకులు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ సుమలత చేపట్టిన శిక్షణ శిబిరం సమర్థవంతంగా కొనసాగుతోందని, ఆమె సారథ్యంలో పలు రాష్ట్రస్థాయి క్రీడాకారులు వెలిసారని ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ తాళ్లపల్లి రమేష్ చెప్పారు.

క్రీడా ప్రోత్సాహకులు జి. రేణుక శ్రీనివాస్, పిండి మాధవి మహేందర్, పిండి విటల్, ఎం. చిరంజీవి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం, హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ వినయ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు క్రీడలలోనూ అవకాశాలు ఉన్నాయని, అందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

- ప్రోగ్రాం వ్యాఖ్యాతగా వ్యవహరించిన హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తిని సత్కరించిన దృశ్యం