“ఐ లవ్ యు నాన్న… నువ్వు నాతోనే ఉండాలి”

- వీర జవాన్ మధుసూదన్‌కు గుండెలవిసే వీడ్కోలు
కావలి, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్): ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ మధుసూదన్‌కు స్వగ్రామంలో ఆర్మీ గౌరవాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జాతీయ జెండాతో కప్పబడిన ఆయన పార్థివదేహం కావలికి చేరుకున్న వెంటనే గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదన, గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు హృదయాన్ని కదిలించాయి.

“ఐ లవ్ యు నాన్న… నువ్వు నాతోనే ఉండాలి” అంటూ కుమారుడు దత్తు తండ్రి భౌతికకాయాన్ని ఆలింగనం చేసుకొని విలపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. శాంతంగా ఉన్న దత్తు కళ్లలో కన్నీటి ధారలు పారుతుండగా, ప్రజలు దయనీయంగా చూసి గుండెలవిసిపోయారు. మధుసూదన్ దేశానికి చేసిన సేవలను గ్రామస్థులు, బంధువులు గర్వంగా చెప్పుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఆయన మృతికి సంతాపం ప్రకటించగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కుటుంబాన్ని పరామర్శించారు. మధుసూదన్ అమరవీరునిగా చరిత్రలో నిలిచిపోతారని, ఆయన త్యాగం వెలకట్టలేనిదని ప్రజలు కొనియాడారు.