
- అనేక ఒడిదుడుకులు, కుట్రలు దాటుకుని విజయాన్ని అందుకున్న ఘనత కేసీఆర్ గారిది :తెలంగాణ మాజీ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాతికేళ్లపాటు నిరంతర పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు ప్రజల గుండెల్లో తెలంగాణ పితామహుడిగా నిలిచారు. ఉద్యమ ప్రారంభంలో ‘బక్క పాణం’గా నిలబడిన ఆయన, ఎన్నో కుట్రలను తిప్పికొట్టారు, అడ్డంకులను అధిగమించారు.
ఆంధ్ర పాలక వర్గాలు “తెలంగాణ సాధ్యం కాదు” అని గేలిచేసినప్పటికీ, ఓపికను ఆయుధంగా మార్చుకున్న కేసీఆర్, ప్రతి అడుగూ మక్కువగా నడిపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సాగిన ఆయన అప్రతిహత పోరాటం చివరికి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు విజయపథం చూపించింది.
పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ పాత్ర అపూర్వమైనది. “కేసీఆర్ ఓ బ్రాండ్… ఓ ట్రెండ్… ఓ లెజెండ్…” అంటూ నేడు ప్రజలు ఆయనను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఎల్కతుర్తి ప్రజలు గులాబీ నాయకుడికి ఘన స్వాగతం పలుకుతూ, తెలంగాణ అభివృద్ధికి ఆయన నాయకత్వానికి పునర్మద్దతు ప్రకటిస్తున్నారు.

