

హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్) : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్… గోపీనాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా గోపీనాథ్‌ను కొనియాడిన ఆయన… “ఒక నిజాయితీగల నాయకుడిని కోల్పోయాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీనాథ్ సేవలు పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు కూడా గోపీనాథ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంఎల్సీ డాక్టర్ బైకుంటం కేసవరావు, మాజీ ఎమ్మెల్యే తుమ్మల నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ బి.బి. పాటిల్, మాజీ ఎమ్మెల్సే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సే భూపాల్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.