రేపు బండ్లగూడలో అభివృద్ధి శంఖారవం

బండ్లగూడ, జూన్ 17 (విశ్వం న్యూస్): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల, ప్రజల ఆశలకు, అభివృద్ధి కలలకు రూపం కలిగించే రోజు వచ్చేసింది. రేపు ఉదయం 10 గంటలకు బండ్లగూడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రకాశ్ గౌడ్ గారు. ప్రజా సంకల్పానికి మద్దతుగా, బంధుత్వానికి గుర్తుగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ శుభకార్యాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరుతూ, బండ్లగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పూలపల్లి కృష్ణ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. “అభివృద్ధి మార్గంలో ప్రతి అడుగు… ప్రజల ఆశయాలకు నిలువెత్తు నిదర్శనం!”