చట్టమే రక్షకుడు, రాజకీయమే కాదు! : దసోజ్ శ్రవణ్

హైదరాబాద్, జూలై 3 (విశ్వం న్యూస్): పోలీసులూ, అధికారులూ… మీరు ఒక్కటే గుర్తుంచుకోండి — మీరు రాజ్యాంగానికి మాత్రమే విధేయులు! ఏ రాజకీయ నాయకుడికీ, ఏ పార్టీకి బానిసలు కారు! మీకు రక్షణ ఇచ్చేది చట్టం, బ్లూ బుక్, సర్వీస్ కండక్ట్ రూల్స్. అవి మీ బాధ్యతను సజావుగా, నిబద్ధతతో నిర్వహించేందుకు మాత్రమే! కానీ వాటిని తొక్కుతూ “ముఖ్యమంత్రి చెప్పాడు”, “మంత్రి ఆదేశించాడు” అన్న మాటల పైనే అక్రమ కేసులు పెట్టడం, నిర్దోషులను వేధించడం అంటే కేవలం బాధితులపై జులుం కాదు, మీరు మీ భవిష్యత్తును స్వయంగా కాలరాస్తున్నట్లే!

ఈ రోజు మీరు చూస్తున్న అవస్థలో… ఏపీలో ఓ ఐపీఎస్ అధికారి తన పదవిని వదిలేసిన దుస్థితి దారుణంగా అద్దమేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జీలు, అక్రమ కేసులు, మానసిక వేధింపులు జరుగుతున్న దృశ్యం చూస్తే, రేపటి చట్టపరమైన తీర్పు ఎవరి పక్షాన ఉండనుందో స్పష్టమవుతుంది. టీ న్యూస్ కార్యాలయంలో పోలీసుల చేత జరిగిన విచారణ వీడియోలు ఎలా సీఎం ఛానెల్ బిగ్ టీవీకి వచ్చాయో? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? చట్టబద్ధమా? లేదా రాజకీయం చేసుకునే కుట్రా సంకేతమా?
ఇంత అరిచప్పుడు “సీఎం చెప్పాడు”, “మంత్రి ఆదేశించాడు” అంటూ అరాచకం చేస్తే… మూడేళ్ల తర్వాత అదే ప్రజాస్వామ్య వ్యవస్థ మీరు మీదే దాడి చేస్తుంది. చట్టం మీకూ వర్తిస్తుంది. చట్టవ్యతిరేక చర్యలకు మీరు కూడా బాధ్యులవుతారు.
ఈరోజు మీరు చూస్తున్న పరుల చరిత్ర రేపటి మీ నామమాత్ర గాథగా మారుతుంది. అధికారాన్ని చేతిలో ఉంచి రాజ్యాంగానికి విధేయతతో, ప్రజల రక్షణ కోసం ఉపయోగించండి. లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు!