ప్రజా సేవకులా? లేక
కాంగ్రెస్ దాసులా?

- “అధికారుల వేషంలో కాంగ్రెస్ చాకిరీలు ఎందుకు చేస్తున్నారు?”
- “ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ.. పాలకుల బూట్లు నాకడం ఏ నియమావళి?”
- “సర్వీస్ రూల్స్ పక్కన పెట్టి కాంగ్రెస్ కోసం జెండా ఊపుతారా?”
- “తప్పుదోవ పట్టించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోండి:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసలుగా మారిన కొందరు అగ్రాధికారులపై బీఆర్ఎస్ బాంబు పేల్చింది. తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి డి.ఎస్. చౌహాన్, ఐఏఎస్ అధికారి హరి చందనలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే. సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ— “ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయపరంగా ప్రవర్తించడం ఆ అధికారి శైలికి తగదు. అధికారులను సైతం కాంగ్రెస్ వర్గం తమ బూటకపు ప్రచారానికి వాడుకుంటోంది. ఇది రాష్ట్ర పరిపాలనకు, ప్రజాస్వామ్యానికి ముప్పు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. “ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అధికారి ఎవరైనా సరే, కఠిన శిక్ష తప్పదని” స్పష్టం చేశారు.