
హైదరాబాద్, ఆగస్టు 19 (విశ్వం న్యూస్): మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సచివాలయంలోకే చేరుకుని అధికారులతో రివ్యూ నిర్వహించడం పెద్ద కలకలం రేపింది. సదాశివపేట మున్సిపల్, హెల్త్, మిషన్ భగీరథ అధికారులను పిలిపించుకుని ఆదేశాలు జారీ చేయడం సచివాలయంలో చర్చనీయాంశమైంది.
“ఎవరి అధికారంతో ఇలా చేస్తారు?” అంటూ అక్కడి ఉద్యోగులు ముక్కున వేలు వేసుకున్నారట. కలెక్టర్ సైతం వెంటనే స్పందించి – “ఈ సమావేశానికి ఎవరి అనుమతి?” అని జగ్గారెడ్డిని నిలదీసినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే సచివాలయంలో అధికారిక మీటింగ్ పెట్టడం పై సీఎస్ కూడా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. రాజకీయ పదవి లేకపోయినా అధికారులపై పట్టు చూపించే ప్రయత్నం జగ్గారెడ్డి చేసిన తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతోంది.