గణనాథుడా? రేవంత్ రెడ్డా?

గణనాథుడా? రేవంత్ రెడ్డా?

హైదరాబాద్, ఆగస్టు 27 (విశ్వం న్యూస్) : గోషామహల్ నియోజకవర్గం అఘాపూర్‌లో వినాయక చవితి సంబరాల్లో వినూత్నతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న విగ్రహం ఏంటో తెలుసా? ఆ విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న గణనాథుడు.

ఈ వినూత్న ఆలోచనతో విగ్రహాన్ని ప్రతిష్టించినది ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఈ వినాయకుడు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేవంత్ రెడ్డి శైలి గెటప్‌లో గణపయ్యను చూడటానికి వచ్చేవారంతా ఆశ్చర్యపోతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *