వేల కోట్లు దారి మళ్లించిన ప్రభుత్వం

టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి
అంబర్ పేట, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : సర్పంచులకు కేటాయించినటువంటి దాదాపు 35 వేల కోట్ల రూపాయలు దారి మళ్లింపుపై విచారణ వ్యక్తం చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గ్రామాల అభివృద్ధి కొరకు కేటాయించినటువంటి దాదాపు 35 వేల కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు తెలియకుండా నిధులు మళ్లించి గ్రామ అభివృద్ధికి అడ్డంపడ్డ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ పున్నారెడ్డి. అదేవిధంగా మళ్లించినటువంటి నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసిన సొంటి రెడ్డి పున్నారెడ్డి.