ఫ్లైఓవర్ వద్దు అంటూ వ్యాపారుల ఆందోళన


తిరుమలగిరి, సెప్టెంబర్ 24 (విశ్వం న్యూస్) : తిరుమలగిరి చౌరస్తాలో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణానికి వ్యాపారులు, చిరు వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. “ఫ్లైఓవర్ వద్దు – రోడ్డు ముద్దు” అంటూ నినాదాలు చేస్తూ అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించకుండా అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ వస్తే వేలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఏడబ్ల్యూ రామరాజు, డీఈఈ శ్రీధర్‌లకు వినతిపత్రం సమర్పించగా, అధికారులు సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొమ్మినేని సతీష్‌కుమార్, కందుకూరి ప్రవీణ్, త్రిశూల్, గుండా భాస్కర్, గజ్జల శేఖర్, సామ ఆంజనేయులు, ఎల్సొజు శ్రీను, బత్తుల శ్రీనివాస్, చిత్తలూరి రామ్మూర్తి, కడియం మల్లయ్య, కాసు బూజు లక్ష్మీనారాయణ, ఉపేందర్, ఎల్సుజు భాస్కర్, సోమ శ్రీనివాస్, పాలవరపు కృష్ణ శ్రీనివాస్, రమేష్, శేఖర్, వీరమ్మ, రేణుక, రవీందర్, శ్యామ్, కృష్ణ, బత్తుల శీను, కొల్లూరు శ్రీనివాస్, jచిన్నగాని శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.