సిసిఐ కొనుగోలు కేంద్రాలను
సద్వినియోగం చేసుకోండి

సూర్యాపేట/నాగారం, అక్టోబర్ 27 (విశ్వం న్యూస్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ సూచించారు.
సోమవారం మండల పరిధిలోని ఈటూర్, ఆవాసం, ప్రగతి నగర్, సిద్ది ఫైబర్, శ్రీనివాస జిన్నింగ్ మిల్లులలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం నిర్దేశించిన రూ.8,110 మద్దతు ధరను పొందాలని సూచించారు. పత్తిలో తేమ శాతం 8లోపు ఉండేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. పత్తి అమ్మే రైతులు ముందుగానే కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ సురేష్, తహసిల్దార్ హరి కిషోర్ శర్మ, సిసిఐ అధికారి గిరీష్, ఏవో కృష్ణకాంత్, పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కన్నెబోయిన వెంకట బిక్షం, జిమ్మిలాల్ అంబేద్కర్, మిల్లు యాజమాన్యం లక్ష్మీనారాయణ, జహంగీర్, సతీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.