నాగారం తహసీల్దార్‌గా దేవేందర్ ప్రసాద్ బాధ్యతలు

నాగారం తహసీల్దార్‌గా
దేవేందర్ ప్రసాద్ బాధ్యతలు

నాగారం, మార్చి 16 (విశ్వం న్యూస్): నాగారం మండల తహసీల్దార్‌గా దేవేందర్ ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో డి సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయన బదిలీపై నాగారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన హరికిషోర్ శర్మ సి.సి.ఎల్.ఏ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఈ సందర్భంగా దేవేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్యాలయానికి వచ్చి తెలియజేస్తే వాటిని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలను సమయానికి అందించేందుకు సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *