జీప్యాట్లో వాగేశ్వరి విద్యార్థుల విజయాలు – ఫెర్వెల్ వేడుకలు ఘనంగా

విశ్వం న్యూస్/ తిమ్మాపూర్, ఏప్రిల్ 8: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఫార్మసీ ప్రవేశ పరీక్ష జీప్యాట్లో అర్హత సాధించి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారు. ఈ విషయాన్ని కళాశాల జనరల్ సెక్రటరీ డా. గండ్ర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జీప్యాట్ అర్హత సాధించిన ఎ. లక్ష్మి డోనా (ర్యాంక్ 1191), పి. మణిదీపిక (ర్యాంక్ 2758), ఎన్. గాయత్రి (ర్యాంక్ 3943), కే. శరణ్య (ర్యాంక్ 5051), ఎ. రక్షిత (ర్యాంక్ 12437), డి. అజయ్ (ర్యాంక్ 25296)లను అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఉన్నత విద్యతో పాటు పరిశోధన రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కళాశాల నుంచి అవసరమైన అకడమిక్ మార్గదర్శకత ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. ప్రిన్సిపల్స్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, డా. ఆర్. రామకృష్ణలు కూడా విద్యార్థులను అభినందించారు.

ఇక వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తృతీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఫెర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. గండ్ర శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.