ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన

ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన

విశ్వం న్యూస్, కరీంనగర్, ఏప్రిల్ 20 : కరీంనగర్‌లోని వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137ఏ సహకారంతో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజల నుంచి మంచి స్పందన పొందింది. ఈ క్యాంప్‌లో సుమారు 100 మంది రోగులకు ఉచితంగా లివర్ ఫంక్షన్ టెస్టులు మరియు వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న జరుపుకునే వరల్డ్ లివర్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఇలాంటి క్యాంప్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు.

అలాగే, భవిష్యత్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఉచిత హెల్త్ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే లివర్ ఫైబ్రో స్కాన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ నాయకులు, స్థానిక ప్రముఖులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *