కరీంనగర్ : పేకాట స్థావరంపై మెరుపు దాడి

- 17 మంది అదుపులోకి, రూ.6.74 లక్షలు స్వాధీనం
విశ్వం న్యూస్/కరీంనగర్, ఏప్రిల్ 21:
కరీంనగర్ నగరంలోని III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సుభాష్‌నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,74,280 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 104 ప్లేయింగ్ కార్డులు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం సబ్ ఇన్‌స్పెక్టర్ బి. చెరాలు కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, టౌన్ ఏసీపీ అనుమతితో సుభాష్‌నగర్‌లోని రెడ్డి హాస్టల్ సమీపంలో ఉన్న సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటిపై దాడి చేపట్టారు. ఇంట్లో రెండు టేబుళ్లపై మూడు కార్డులతో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనలో సిరిపురం నాగభూషణం (A1), చింతల రవీందర్ (A2), బండ రత్నాకర్ రెడ్డి (A3), గోదాల రాజిరెడ్డి (A4), జంగ దేవేందర్ రెడ్డి (A5), దొంతుల భరత్ (A6), ముష్కం ఉపేందర్ (A7), తల్లపల్లి తిరుపతి (A8), రవికంటి సందీప్ (A9), మేచినేని శ్రీనివాస్ రావు (A10), కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి (A11), ముష్కం ఎల్లయ్య (A12), తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు (A13), అలువోజు సంపూర్ణచారి తదితరులను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.