వైష్ణవి సోదరుడి సంచలన సెల్ఫీ వీడియో

వైష్ణవి సోదరుడి సంచలన సెల్ఫీ వీడియో

వైష్ణవి సోదరుడి సంచలన సెల్ఫీ వీడియో

విశ్వం న్యూస్/నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. హత్య అనంతరం సంతోష్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి, హరిబాబును తానే హత్య చేశానని పేర్కొన్నాడు

తన చెల్లి వైష్ణవికి జరిగిన ఘటన మరో మహిళకు జరగకూడదనే ఉద్దేశంతోనే హరిబాబును హత్య చేసినట్లు సంతోష్ వీడియోలో చెప్పాడు. హరిబాబుపై చర్యలు తీసుకుని తన చెల్లికి న్యాయం జరుగుతుందని చాలా రోజులుగా ఎదురుచూశానని, అయితే న్యాయం జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు.

తనను ఆదుకోవాలని, తనకు భార్య, పిల్లలు ఉన్నారని చెబుతూ సంతోష్ ప్రజలను కోరాడు. తనకు మద్దతు ఇచ్చి త్వరగా బయటకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశాడు. హరిబాబు మృతితో తనకు సంతోషంగా ఉందని కూడా వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు సంతోష్ భార్య స్పందిస్తూ.. తన భర్త హత్య చేయడం సరైనదా? కాదా? అనేది ప్రజలే చెప్పాలని కోరింది. ఇద్దరు పిల్లలను, తనను వదిలి భర్త జైలుకు వెళ్లడంతో బాధగా ఉందని తెలిపింది. అయితే వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోయాడనే విషయం తనకు కొంత ఆనందాన్ని కలిగించిందని పేర్కొంది. తన భర్త బయటకు రావడానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి ఆరోపణలు, గతంలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *