పీఆర్సీ, డీఏలు వెంటనే మంజూరు చేయాలి

పీఆర్సీ, డీఏలు వెంటనే మంజూరు చేయాలి

పీఆర్సీ, డీఏలు వెంటనే మంజూరు చేయాలి

విశ్వం న్యూస్ / హైదరాబాద్, అక్టోబర్ 1:
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి

ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ కింద 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల్లో కనీసం మూడు డీఏలను వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని కోరారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ నుంచి నివేదికను తెప్పించుకుని, అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హెల్త్ స్కీమ్ అమలు చేయాలి

ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ హెల్త్ స్కీమ్‌ను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల చికిత్సలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల జీతాల నుంచి నెలవారీగా 1.5 శాతం కేటాయిస్తున్నప్పటికీ, హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు కాకపోవడం బాధాకరమన్నారు. పెండింగ్‌లో ఉన్న వైద్య, ఇతర బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.

ఉద్యోగులతో చర్చలు జరపాలి

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ముజాహిద్ హుస్సేన్ కోరారు. ఉద్యోగ సంఘాలను పిలిచి సమస్యలపై చర్చించి, పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *