ఆపదల్లో అండగా ‘అంబాల ప్రభు’

మృతుని కుటుంబానికి 50 కిలోలు మరియు జయ బోర్ వెల్స్ అధినేత తూర్పాటి లింగయ్య సహకారంతో 50 కిలోల రైసును అందజేత…
జమ్మికుంట, పిబ్రవరి 23 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ గ్రామానికి చెందిన పాతకాల చంద్రయ్య ఈనెల రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా మృతుని కుటుంబాన్నిగురువారం రోజున నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మృతుని కుటుంబానికి తన వంతుగా 50 కిలోలు, జయ బోర్ వెల్స్ అధినేత తూర్పాటి లింగయ్య సహకారంతో 50 కిలోల రైసును మొత్తంగా క్వింటాల్ రైస్ ను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దూడపాక శ్రీనివాస్ మాట్లాడుతూ నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభు జమ్మికుంట పరిసర ప్రాంతాలలో కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోయిన వారికి తన వంతు సహాయ సహకారంగా దాదాపు వందల కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని, క్వింటాలకొద్ది బియ్యాన్ని అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రభు ఇలాంటి సహాయ సహకారాలు నిరుపేదలకు మరి ఎన్నో అందజేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు దొగ్గల శ్రీధర్ ఈ సహాయాన్ని అందించినందుకు గాను మృతుని కుటుంబ సభ్యుల తరఫున నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభు జయ బోర్ వెల్స్ అధినేత తూర్పాటి లింగయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబాల రాజు, ఇనుగాల సతీష్, తూర్పాటి రాజు, వంగ శ్రీకాంత్ రెడ్డి, లోకిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.