సావిత్రి భాయ్ పూలేకి ఘననివాళి

మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన దీశాలి : నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్
జమ్మికుంట, మార్చి 10 (విశ్వం న్యూస్) : ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో సావిత్రిబాయి పూలే గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ జనవరి 3.1831 మహారాష్ట్రలో జన్మించిన సావిత్రిబాయి 19వ శతాబ్దంలో మహిళా విద్య సాధికారత సాధించడం కోసం కీలక పాత్ర పోషించిన భారతీయ సంఘసంస్కర్. విద్యావేత్త. కవయిత్రి, ఆ కాలంలో సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావు పూలే గారితో కలిసి పూణేలో మొదటి బాలిక పాఠశాల స్థాపించిన ఘనత సాధించింది. వితంతువులకు విద్యను అందించడం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధి కెక్కారు. ఆనాటి అగ్రవర్ణాలు పాఠశాలకు వెళ్లి వస్తుండగా దుమ్ము. పేడ కలిపిన నీరు మీద చల్లుతూ అవమానించేవారు. ప్రతి రోజు ఒక జత దుస్తులు ఎక్కువ బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వెళ్లి మహిళలకు విద్య బోధించేవారు. మహిళల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడిన అభ్యుదయవాది. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధించడం కోసం లింగ సమానత్వం కోసం, స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించాలని పిలుపునిచ్చారు.