ఘనంగా న్యూ మిలీనియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

- ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, మార్చి 21 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ఉన్నత పాఠశాలలో రంగ రంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, మరియు హుజూరాబాద్ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, కౌన్సిలర్ శ్రీపతి నరేష్, మొలుగు దిలీప్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు.
