పోలీసులు-మీకోసం

వీణవంక మోడల్ స్కూల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కే.శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో …
వీణవంక, మార్చి 21 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని మోడల్ స్కూల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మీకోసంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోటివేషన్ స్పీకర్స్ టి.ఏ.పి స్వామి, గాజుల అనిల్, బి శ్రీనివాస్, హాజరై పరీక్షలపై అవగాహన, అపోహలు గురించి వివరించారు. స్టడీ స్కిల్స్, పాఠ్యాంశాల ప్రాముఖ్యత, మైండ్ మ్యాపింగ్, మోటివేషన్, సమయం విలువ, వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సిఐ జె.సురేష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
