దళితజాతిని ధనవంతులను చేయడమే కెసిఆర్ లక్ష్యం

- దళితబందు యూనిట్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్
జమ్మికుంట, మార్చి 25 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన మ్యాకమళ్ల అరుణ-ఎల్లయ్య లకు దళిత బందు ద్వారా మంజూరైన అరుణ ఎలక్ట్రికల్ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులను ధనవంతులను చేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితులు అడగకుండానే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎలాంటి బ్యాంక్ కాన్సెంట్ లేకుండా నేరుగా తమ ఖాతాలో పడేవిధంగా రూపకల్పన చేసిన కేసీఆర్ కి దళిత పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ దళితులు ఇట్టి దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరారు.

అరుణ ఎలక్ట్రికల్ షాప్ పది లక్షల రూపాయలు మంజూరు కాగా మొదటి విడతగా ఐదు లక్షలు విడుదల రావడం సంతోషకరమని వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
10లక్షలను ఉపయోగించుకొని వ్యాపారంగా అభివృద్ధి చెంది కోటి రూపాయలుగా మార్చాలని కోరారు. దళితులు కేసిఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞత భావం ఉంటూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలలో కెసిఆర్ ఒక సైనికుడుగా ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మడిపల్లి గ్రామ సర్పంచ్ మూగల పరుష రాం, కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సత్యం, నంది అవార్డ్ గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు), సారబద్రం, శ్రీనివాస్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.