నిధులు కేటాయిచాలని మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ కు వినతి పత్రం

నిరుపయోగంగా ఉన్నకమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి : స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, శివ సాయినగర్ కాలనీవాసులు
బండ్లగూడ జాగిర్, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డు శివ సాయి నగర్ లో నిరుపయోగంగా ఉన్నకమ్యూనిటీ హాల్ కు నిధులు కేటాయించి ప్రజల ఉపయోగార్డం చేకూర్చాలని మేయర్ గారికి వినతి పత్రం స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ కాలనీవాసులు కోరడం జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీ హాలు నిర్మించి నిరుపయోగంగా ఉన్నందున కాలనీ వారికి పండుగలకు మరియు స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవాలకు ఇబ్బందిగా ఉన్నది అన్నారు. కమిటీ హాల్ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరగా మేయర్ మహేందర్ గౌడ్ గారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శివ సాయి నగర్ కాలనీ ప్రెసిడెంట్ వినయ్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రవణ్ కుమార్, అల్లం శ్రీనివాస్, రాజేష్, కిరణ్ రఘువీర్ లు పాల్గొన్నారు.