ఎంపీ రవిచంద్ర, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ ల ఆత్మీయ పలకరింపు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ లు ఆత్మీయంగా పలకరించుకున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు శుక్రవారం మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వెళ్లిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రవిచంద్ర,పవన్ కళ్యాణ్ లు ఎదురుపడి ఆత్మీయంగా పలకరించుకున్నారు.కొద్దిసేపు ముచ్చటించుకున్నారు,పరస్పరం యోగక్షేమాలు, కాపు సంఘాల విషయాలపై మాట్లాడుకున్నారు.