పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్, జనవరి 2 (విశ్వం న్యూస్) : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం దిగారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని నిలదీశారు. ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం పోలీసుల డ్యూటీ గానీ.. ఇక్కడి నుండి అక్కడికి పోవడానికి ఎందుకు రిస్ట్రిక్షన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించి.. నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. కేసీఆర్ సర్కారు నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన ఫండ్స్ ను సైతం పక్కదారి పట్టించడం దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సరైన పద్థతి కాదు.