పేదల అవసరాన్ని గుర్తించిన పెద్దమనిషి

పేదల అవసరాన్ని
గుర్తించిన పెద్దమనిషి

  • చిత్రపురి కాలనీ నిర్మాణంలో ఆయన పాత్ర మరవరానిది
  • ఐదు వేలకుపై బడి సినీ కార్మికులకు నీడ నిచ్చిన మహానుభావుడు
  • హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో దివంగత నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న లోకసభ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, దర్శకుడు శంకర్, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు

హైద‌రాబాద్, జూలై 1 (విశ్వం న్యూస్) : జన జీవితంలో తన అవసరం కంటే తనతో సినీ రంగంలో పనిచేస్తున్న పేద కార్మికుల అవసరమే ముఖ్యమని భావించిన మాహానుబావుడు దివంగత సినీ నటుడు డాక్టర్ యం.ప్రభాకర్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. అటువంటి మాహానుబావుడు పోరాటాల గడ్డ నల్లగొండ బిడ్డడు అయినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత నటుడు డాక్టర్ యం.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

లోకసభ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్,సినీదర్శకుడు శంకర్ లతో పాటు ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఐదు వేల మంది పేద సినీ కార్మికులకు నీడ నిచ్చే కాలనీ ఏర్పాటులో ఆయన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

వృత్తి రీత్యా వైద్యుడు అయినప్పటికీ నాటక రంగం మీద ఉన్న మక్కువతో మద్రాస్ కు చేరుకుని 472 పై చిలుకు సినిమాలలో నటించారన్నారు.హైదరాబాద్ కు సినీపరిశ్రమ తరలి వచ్చిన సందర్భంలో పరిశ్రమలు అంటే యజమానులు మాత్రమే కాదని,అందులో కార్మికులు కూడ ఉంటారని అందులో పేదలను వారి ఆకలిని గుర్తించిన పెద్దమనిషి ప్రభాకర్ రెడ్డి అని ఆయన చెప్పారు. అటువంటి మహనటుడి జన్మదినం మాత్రమే కాకుండా వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని డాక్టర్ల దినోత్సవం రోజున ఆవిష్కరించుకోవడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *