ఘనంగా ఈటల జన్మదిన వేడుకలు

వీణవంక, మార్చి 20 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన మద్దుల ప్రశాంత్ పటేల్ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా షామీర్పేట్ లో తమ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈరోజు లక్ష్మక్కపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను మద్దుల ప్రశాంత్ పటేల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ముద్దుల ప్రశాంత్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బొంకూరి సమ్మయ్య, గెల్లు శీను, మేకల రాజిరెడ్డి, నందికొండ కొండారెడ్డి, గోపి, పరశురాం రెడ్డి, గెల్లు పోచాలు, రెడ్డి రాజుల స్వామి, గూడెం తిరుపతిరెడ్డి, మేకల ఇంద్రారెడ్డి ,మర్రి సమ్మయ్య, మర్రి పర్వతాలు, శెట్టి ప్రదీప్, గెల్లు ఓం ప్రకాష్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.