పసునూరు మోడల్ స్కూల్లో
ఇంటర్ విద్యార్థులకు ఘన వీడ్కోలు

నాగారం, ఫిబ్రవరి 21 (విశ్వం న్యూస్): నాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఉన్న పసునూరు మోడల్ స్కూల్లో శనివారం ఇంటర్మీడియట్ విద్యార్థుల వీడ్కోలు వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగారం మండలం ఎస్సై చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండాలని సూచించారు. లక్ష్యసాధనకు పట్టుదల, నిరంతర కృషి ఎంతో అవసరమని తెలిపారు.
మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బల్గూరి చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని, చదువు జీవితానికి వెలుగునిచ్చే దీపమని పేర్కొన్నారు.
అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ గురువుల సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలరాజు, సోమసుందర్, రవి, లింగరాజు, కృష్ణ, నాగరాజు, వీరన్న, అశోక్, లింగయ్య, మహేష్, కలింగయ్య, పీడీ మహేష్, శ్రావణ్, వెంకన్న, నరేష్, సాయిరాం, సాధన, రాధా, విజయలక్ష్మి, హసీనా, సుమారాణి, వెంకటరమణతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.