ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

హైదరాబాద్, డిసెంబర్ 08 (విశ్వం న్యూస్):హైమావతి నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గల శివాలయం గుడి ముందు రెండు రోజులుగా వేద పండితుల చేత దాత అయిన చింతపల్లి మోహన్ రెడ్డి డిఎస్పి, చింతపల్లి శోభా రాణి వారి కుటుంబ సభ్యులు నిష్టతతో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి నేటితో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం నిర్విఘ్నంగా అశేష భక్తుల మధ్యన సుఖాంతమైనది.

ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉందని ఒకే ఆవరణలో ఆంజనేయ స్వామి దేవాలయం, గణేష్ మండపం, హిమదుర్గ మందిరం, శివాలయం, దత్తాత్రేయ విగ్రహం, సాయిబాబా మందిరం, నవగ్రహాలు, వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు మొదలగునవి ఉండడం వల్ల అశేష ప్రజానీకాన్ని ఆకర్షించి తద్వారా భక్తి భావాలు పెంపొందించడం తోబాటు భగవంతుని యెడల నమ్మక విశ్వాసములు పెంపొందించే అవసరం అవకాశాలు మెండుగాని అగుపడుతున్నందున అశేష భక్తులు ఆకర్షింపబడుతున్నారు.

ఈరోజు భక్తులు తమ మనోభావాలు వెలువరించిన సందర్భంగా ఇకముందు భక్తుల దాతల సహకారంతో గుడిని అభివృద్ధి చేసేందుకు మాకు మనోధైర్యం కల్పించినందుకు వారికి కృతజ్ఞులై ఉన్నాము అని తమ యొక్క అభిప్రాయం వెలిపించారు.

ఈ కార్యక్రమములో డా.బి కె.జి. విజయలక్ష్మి,డా. కె. హెచ్. ఎస్. శర్మ, జి శ్రీనివాస్, డి రవి గౌడ్, అనురాధ, రాధిక, వి. రాధాకృష్ణ, ఎన్. జనార్దన్ రావు, సి ఎస్ ఆర్ మూర్తి, పి వెంకట దాస్, ఇందిరా, పి పద్మ, డా.పద్మ ప్రియ రామారావు, రాధా, శోభ, రాధిక , శశికళ రెడ్డి మరియు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *