బోడుప్పల్ నారాయణ స్కూల్లో ఘనంగా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన

బోడుప్పల్ నారాయణ స్కూల్లో ఘనంగా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన

డాక్టర్ రమేష్, ఎజిఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపల్ సత్యవాణి హాజరు
బోడుప్పల్, పిబ్రవరి 28 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాయణ కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూల్లో విజ్ఞాన శాస్త్రవేత్త అయిన సివి రామన్ పుట్టినరోజు పురస్కరించుకొని అకాడమిక్ ఫెయిర్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాస్త్రవేత్త డాక్టర్ రమేష్, ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపాల్ సత్యవాణి తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన ఎగ్జిబిట్స్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు చూసి ఆనందించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సైన్స్ ఫెయిర్స్ ఇలాంటివి కూడా అవసరమని కొనియాడారు. అదేవిధంగా పాఠశాలలో ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ చాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఏవో శ్రీనివాస్, పిఈటి మోహన్, స్కూల్ స్టాప్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *