ఘనంగా ఆత్మీయ సన్మానం

ఘనంగా ఆత్మీయ సన్మానం

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విశ్వం న్యూస్) : హైమావతి నగర్, మోతి నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ మరియు శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి స్నేహితం ట్రస్ట్ చైర్పర్సన్, ఆలయ కమిటీ జాయింట్ సెక్రెటరీ డా.బి.కె. గూడూరి విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గణనాథుని తొమ్మిది రోజుల పూజా మరియు ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులకు మరియు దాతలకు, ఆలయ పురోహితులకు ఘనంగా ఆత్మీయ సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులకు, ప్రోగ్రాంకు తమ చేయుతను అందించిన వారికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా శాలువాలతో పాటు మెమొంటో లిచ్చి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వి. రాధాకృష్ణ ఆల్ ఇండియా రేడియో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్రాంత అధికారి, శోభ రాణి, పి. వెంకట దాస్ ప్రముఖ కవి, విశ్రాంత పోలీస్ అధికారి, పి.పద్మ, బండి కళ్లు శ్యాంప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీ CEO,డా.కె.ఎచ్.ఎస్. శర్మ, జి. శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ జి. అనురాధ, జి. శ్రీధర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, జి. మహేందర్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్, డి. రవి గౌడ్ కోశాధికారి, డి. రాధిక, ఆలయ పూజారి రామాచారి, భీమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *