యువకునికి చేయూత

ఐఎఎస్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నతిరుపతికి ఆర్థిక సహాయం
స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్, లయన్. ఆకుల రమేష్ తన వంతు సహాయంగా రూ. 10,000
హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : సరస్వతి కటాక్షం ఉన్న, లక్ష్మి కటాక్షం లేక దీనస్థితిలో ఉన్న కుటుంబం నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నత చదువులు చదువుతు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కలవాల తిరుపతి. హన్మకొండ జిల్లా, శాయం పేట మండలం, పెద్దకోడేపాక గ్రామానికి చెందిన కలవాల పోచయ్య భద్రమ్మ దంపతుల రెండవ కుమారుడు కలవాల తిరుపతి ఎలాంటి శిక్షణ లేకుండా ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నాడు. మూగ చెవిటివాడైన తిరుపతి తన పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసిస్తున్నాడు. తన అభ్యాసం అంత వరంగల్ పట్టణ చుట్టుపక్క ప్రాంతంలోనే కొనసాగింది. తిరుపతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దాతల సహకారంతో ఐఏఎస్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అర్హత పొంది ఐఏఎస్ మెన్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. తిరుపతి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొన్న స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్, లయన్. ఆకుల రమేష్ తన వంతు సహాయంగా 10,000 రూపాయలు, నూతన బట్టలు, ఐఏఎస్ బుక్స్ పెట్టి తిరుపతికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియాఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ అవార్డుల కార్యక్రమంలో కలవాల తిరుపతికి ప్రోత్సహిస్తున్న వారి కుటుంబ సభ్యులను, అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ నేటి మహిళలు భూగర్భ కార్యకలాపాల్లో, భూమిపై, అంతరిక్ష యానంలో కూడా అన్ని శాఖల్లో పని చేస్తూ పురుషులకంటే కూడా ఉన్నత
పదవుల్లో రాణించడం గొప్ప విశేషం, రక్షణ రంగంలో కూడా మహిళలు ఉన్నతమైన పదవులు అలంకరించి పురుషులకంటే మేమేమి తక్కువ కామని నిరూపిస్తున్న దాఖలాలు మన కండ్లు ఎదురుగానే కనబడుతున్నా యని, కనుక మీ ఐక్యమత్యమే మీ బలం, మీరు పిడికిలి బిగించి ఒక్క అడుగు ముందుకు వేస్తే మీ వెంబడి సమాజం మీ వెంట నడుస్తుందని హితవు పలికారు.
లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ హైదరాబాద్ డాక్టర్ లయన్ కె యాదవ్ గౌడ్, తెలంగాణ హైకోర్టు సూపర్డెంట్ అంజని కుమారి, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డా, సురభి శ్రీధర్, బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కందుల సంధ్యారాణి. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా, హరి హర శర్మ, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో కోశాధికారి డాక్టర్ కోడెల మంజుల చేతుల మీదిగా వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ ఆకుల రమేష్ మాట్లాడారు.
తిరుపతి తన పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు ప్రయా ణించడం అభినందనీయమని అన్నారు. తను అనుకున్న లక్ష్యం సాధించాలని ఆకాంక్షిస్తున్న అని అన్నారు. తన వంతు సహాయంగా పదివేల రూపాయలు ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ మెటీరియల్ నూతన వస్త్రాలను చెన్నారెడ్డి చేతుల మీదుగా పెట్టడం జరిగిందని తిరుపతికి ఆత్మీయ సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావి స్తున్నాను అని, ప్రతినెల తిరుపతి ఖర్చులకు తన వంతుగా సహాయ సాకారం అందిస్తాను అని ఆకుల రమేష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొడపాక మాజీ సర్పంచ్ ఇమ్మడిశెట్టి రమాదేవి రవీందర్. సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి, శ్రీనివాస్ జర్నలిస్టు నీరజ, ఆకుల భవాని, డా. కనకం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.