వార్డ్ అధ్యక్షుల ముఖ్య సమావేశం

జమ్మికుంట, మే 16 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ పరంగా పనిచేస్తున్న వార్డు అధ్యక్షులు ఎనలేని కృషితో పార్టీకి పని చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కావడంతో వార్డు అధ్యక్షులను విస్మరిస్తున్నారని పార్టీకి ఎనలేని కృషిచేసిన వార్డ్ అధ్యక్షులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కొత్త నాయకత్వంలో మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ లను, బడా లీడర్లకు తప్ప వార్డు అధ్యక్షులను పార్టీ మీటింగ్ కానీ, ఏ ప్రోగ్రాం ఉన్నా గానీ ఆహ్వానం కూడా లేదని వార్డు అధ్యక్షులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షుడు టంగుటూరు రాజకుమార్, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల అధ్యక్షులు పాల్గొన్నారు.