సురక్ష హాస్పిటల్ లో వైద్యుల
నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి

జమ్మికుంట, జూలై 6 (విశ్వం న్యూస్) : సైదాపూర్ మండలం గోడిశాల గ్రామానికి చెందిన మిడిదొడ్డి బక్కయ్య (58) అనారోగ్య సమస్యతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం రోజు రాత్రి చేరారు.
రోగి పరిస్థితుల దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట సురక్ష హాస్పిటల్ కి వెళ్ళమని తెలుపగా అదే రోజు రాత్రి 1గం సమయంలో హాస్పిటల్ కి రోగిని తీసుకొని రాగా వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో రోగి పరిస్థితి విషమించి మరణించినట్లు కుమారులు తెలుపుతూ జమ్మికుంట సురక్ష హాస్పిటల్ ముందు బంధువులతో నిరసనకు దిగారు.
సురక్ష హాస్పిటల్ సిజ్ చేసి వైద్యులపై చర్య తీసుకొని మరొకరికి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూస్తూ, తమకు సరైన న్యాయం చేయాలని తెలుపుతూ హాస్పిటల్ ముందు బైఠాయించారు.