కరచాలనంతో రాజకీయ శుభారంభం

కరచాలనంతో
రాజకీయ శుభారంభం

  • శాసనమండలి
    జనవరి 2కు వాయిదా

హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం కొద్దిసేపు మాత్రమే సభలో కూర్చున్న కేసీఆర్, హరీశ్‌రావుతో కలిసి బయటకు వచ్చి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు.

సభ ప్రారంభానికి ముందే మిగతా సభ్యుల కంటే ముందుగా వచ్చి తన స్థానంలో కూర్చున్న కేసీఆర్, కార్యక్రమాలు మొదలైన కొద్దిసేపటికే సభను వీడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది.

ఇదిలా ఉండగా, శాసన మండలిని జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు. సభ ప్రారంభం రోజున ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం మండలి అధ్యక్షులు సమావేశాన్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది 2026 జనవరి 2న శాసన మండలి తిరిగి ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *