అదృష్టం–దురదృష్టం
మధ్య రాజకీయ చిత్రపటం

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 2026 (విశ్వం న్యూస్) : అదృష్టం అంటే అలా ఉంటుంది మరీ… 🥰
ప్రజల నమ్మకమే పెట్టుబడిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన స్వతంత్ర అభ్యర్థికి అనూహ్య విజయం లభించిన ఉదంతం ఇది.
మహబూబాబాద్ మున్సిపాలిటీ నాలుగవ వార్డు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి జ్యోతిరమేష్ ఘన విజయం సాధించడమే కాకుండా, చైర్మన్ పదవి దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పార్టీ అండ లేకపోయినా ప్రజల మద్దతే తన బలం అని నిరూపిస్తూ జ్యోతిరమేష్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
అయితే దురదృష్టం అంటే ఇలా ఉంటుంది… 😭
పదవి ఆశతో కోట్ల రూపాయలు వెచ్చించినా, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
నిజామాబాద్ కార్పొరేషన్ 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కాటిపల్లి శమంతకు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్‌కు అడ్డుగా ఉన్న సుమారు రూ.8 కోట్ల పన్ను బకాయిలను చెల్లించి బరిలో నిలిచిన శమంత, మేయర్ పదవి ఖాయమనే నమ్మకంతో భారీగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది.
ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేశారని, ఇతర డివిజన్లలోనూ మద్దతు కోసం మొత్తంగా దాదాపు రూ.20 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం. అయినప్పటికీ ఫలితాల్లో ప్రజలు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె స్వంత డివిజన్‌లోనే బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో తీవ్ర ఆవేదనకు గురైన శమంత కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగినట్లు తెలిసింది.
ఈ రెండు ఘటనలు కలిసి ఒకే విషయాన్ని చెబుతున్నాయి—
రాజకీయాల్లో డబ్బు కాదు, చివరికి గెలిపించేది ప్రజల నమ్మకమే.