సోమిడిలో ప్రత్యేక వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: కాయిత రాజ్ కుమార్ యాదవ్

- జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
కాజీపేట, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్): కాజీపేట 62వ డివిజన్లోని సోమిడి లో ప్రత్యేక వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దర్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు కాయిత రాజ్ కుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. సోమిడికి చెందిన రైతులు ఇతర కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సోమిడిలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గత కొద్ది సంవత్సరాలుగా అధికారులకు విన్నవిస్తున్న స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల ఇబ్బందులను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేకల శ్రావణ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర నర్సింగ్ గౌడ్, నాయకులు కాయిత వేణుగోపాల్ యాదవ్, కుమార్ యాదవ్, దామెర కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.